ఇన్ని రోజులు ఇంత సొగసు యాడ దాచుకున్నావూ..
ఇంత కాలం ఇంత మనసు ఏమి చేసుకున్నావూ..(2)
ఇన్ని రోజులు ఇంత సొగసు యాడ దాచుకున్నావూ..
మనసు నాకు ఉన్నదని నీ మనసే వచ్చి తెలిపినదీ
మూసి ఉన్న ఆ తలుపును నువ్వే మొదటిసారిగా తెరిచినది (2)
సూర్యుని వెలుగు సోకినప్పుడే తామర అందం తెలిసేదీ.. (2)
నీ చోపులు నా పై పడినపుడే సొగసులు నాలో విరిసేది..
ఇన్ని రోజులు ఇంత సొగసు యాడ దాచుకున్నావూ..
అందలాన అందీ అందని అందమల్లె నువున్నావూ.
అందుకోను చెయ్యి చాపే ఆసల్లీ నేనున్నాను..
అందలాన్ని దిగి వచ్చానూ..
అందుకొమ్మని చేయిచ్చానూ
ఆకు చాటు మల్లెను నేను..
అంతకన్నా ఏం చేస్తానూ.
ఇన్ని రోజులు ఇంత సొగసు యాడ దాచుకున్నావూ..
ఇంత కాలం ఇంత మనసు ఏమి చేసుకున్నావూ..
కాటువేసే కరినాగే నీ కౌగిలిలో నను చేర్చినది (2)
ఓర్వలేనిదీ కుళ్ళు లోకం విడదేస్తే ఏం చేసేదీ?
మనసిస్తే చాలునును నాకూ నువు మాటిస్తే చాలును నాకూ
మనసులేని మనుషుల మాటే వద్దు ఇంక నీకూ నాకూ
ఇన్ని రోజులు ఇంత సొగసు యాడ దాచుకున్నావూ..
ఇంత కాలం ఇంత మనసు ఏమి చేసుకున్నావూ..
లాలలాల లాలా లాలలాలలా.
చిత్రం : గాజుల కిష్టయ్య (1975)
సంగీతం : కె .వి.మహదేవన్
రచన : ఆత్రేయ
గానం : S.P.బాలు , P.సుశీల