ఎవరు నీవు నీ రూపమేదీ ..ఏమని పిలిచేదీ
నిన్నేమని పిలిచేదీ
నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేదీ
మీ కెలా తెలిపేదీ..
నిదుర పోయిన మనసును లేపి
మనిషిని చేసిన మమతవు నీవో
నిదురేరాని కనులను కమ్మని
కలలతో నింపిన కరుణవు నీవో
పూ జకు తెచ్చిన పూవును నేను
సేవకు వచ్చిన చెలిమిని నేను
పసివాడే ఆ పసిపాపలకై
దేవుడు పంపిన దాసిని నేను
//నేనని వేరే //
చేదుగ మారిన జీవిత మందున
తీపిన చూపిన తేనెవు నీవు
వడాగాడ్పులలో వడలిన తీగకు
చిగురులు తొడిగిన చినుకే మీరు
చిగురు తొడిగిన చినుకే మీరు...
కోరిక లేకా కోవెలలోన
వెలుగై కరిగే దీపం నీవు
దీపం లోని తాపం తెలిసి
ధన్యను చేసే దైవం మీరు
దైవం మీరు..
అహా హా అహా హా..
చిత్రం : ప్రేమలు - పెళ్ళిళ్ళు (1974)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
రచన : సి.నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల , పి.సుశీల