ఎవరన్నారివి కన్నులని
అరెరె మధువొలొకే గిన్నెలవి
ఎవరన్నారివి బుగ్గలని
హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి
ఎవరన్నారివి కన్నులని ....
నడుమిది ఏమంటున్నది
ఈ నడుమిది ఏమంటున్నది
నా పిడికిట ఇమడెదనన్నది
నల్లని జడ ఏమన్నది
నా నల్లని జడ ఏమన్నది
అది నను బంధించెద నన్నది
నను బంధించెదనన్నది
//ఎవరన్నారివి //
సిగ్గులు దోసిట దూయకు
నా సిగ్గులు దోసిటదూయకు
నీ చేతుల బందీ చేయకు //2//
మెల్లగ లోలో నవ్వకు
మెలమెల్లగ లోలో నవ్వకు
చలచల్లగ పిడుగులు రువ్వకు
చల్లగ పిడుగులు రువ్వకు
// ఎవరన్నారివి కన్నులని //
అడుగున అడుగిడుటెందుకు
నా అడుగున అడుగిడుటెందుకు
నువు తడబడి పోతున్నందుకు
మరి మరి చూచెదవెందుకు
నను మరి మరి చూచెదవెందుకు
నువు మైకం లో ఉన్నందుకు
మైకంలో ఉన్నందుకు
//ఎవరన్నారివి కన్నులని //
చిత్రం : దొరికితే దొంగలు (1965 )
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : ఘంటసాల , పి.సుశీల
************************************
Movie Name : Dorikithe Dongalu (1965)
Music Director : Saluri Rajeswara Rao
Lyricist : C Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela