పల్లవి
మంచిని సమాధి చేస్తారా
ఇది మనుషులు చెసే పనియెనా
మనలో పాపం చెయ్యని వాడు ఎవ్వరో చెప్పండి..
ఏ దోషం లేని వాడు ఎవ్వరొ చూపండి..
చరణం
కత్తితో చెధించలేనిది..కరుణతో చెధించాలి
కక్షతో కాని పని..క్షమాబిక్షతో సాధించాలి
తెలిసి తెలియక కాలు జారితే
తెలిసి తెలియక కాలు జారితే
చెయూత నిచ్చి నిలపాలి
మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి
లోపాలు లేని వారు ఎవరో చూపండి
చరణం
గుడులలో లింగాలను మెక్కే బడా భక్తులు కొందరు
ముసుగులో మోసాలు చెసే మహా వ్యక్తులు కొందరు
ఆకలి తీరక నేరం చెసే
ఆకలి తీరక నేరం చెసే..ఆభాగ్య జీవులు కొందరు
మనలో నేరం చెయ్యని వాడు ఎవరో చెప్పండి
ఏ దోషం లేని వాడు ఎవ్వరొ చూపండి..
చరణం
తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి
మరపు రాని గుణపాఠం పది మందిలో నెర్పించాలి
అయితేఎన్నడు పాపం చెయ్యని వాడు ముందుగ రాయి విసరాలి
మీలో పాపం చెయ్యని వాడే ఆ రాయి విసరాలి
ఏ లోపం లెని వాడే ఆ శిక్ష విధించాలి
చిత్రం : నేరం నాది కాదు ఆకలిది (1976)
సంగీతం:- సత్యం
సాహిత్యం:-
గానం:- బాలు