శ్లోకం :
వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ...
నిర్విఘ్నం కురుమే దేవ... సర్వకార్యేషు సర్వదా... ఆ.... ఆ...
పల్లవి
:జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
ఆ.... ఆ.... ఆ....
చరణం : 1
బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవా
మహిలో జనులకు మహిమలు చాటి
ఇహపరములనిడు మహానుభావా
ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చేగణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచు
నిరతము పెరిగే మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్యప్రవూణం
ధర్మదేవతకు నిలుపును ప్రాణం
విజయకారణం విఘ్ననాశనం కాణిపాకలో నీ దర్శనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
చరణం : 2
పిండిబొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండనాయకుడివైనావు
మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలోదాచి లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని గూర్పగ లక్ష్మీగణపతివైనావు
వేద పురాణములఖిలశాస్త్రములు
కళలు చాటును నీవైభవం
వక్రతుండమె ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక... ఆ... ఆ...
చిత్రం : దేవుళ్ళు (2001)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
************************************
Vakratunda Mahaa Kaaya Koti Surya Samaprabha
Nirvignam Kurumedevaa Sarva Kaaryeshu Sarvadaa...
aa...aa..aa..aa..
Jaya Jaya shubakara vinaayaka
sree Kaanipaaka vara siddi vinaayaka
Jaya Jaya shubakara vinaayaka
sree Kaanipaaka vara siddi vinaayaka
aa..aa..aa..aa..aa...
Bahudaa nadi teeramlona baavilona velasina deva
Mahilo janulaku mahimalu chaati yihaparamulanidu mahaanubaava
istamainadi vodilina nee kada ista kaamyamulu teerche ganapathi
Karunanu kuriyichu voramulu vosaguchu niratamu perige mahaa kruti
sakala charaachara prapamchame sannuti chese vignapathi
Nee gudilo chese satya pramaanam dharmadevathaku nilupunu praanam
vijaya kaaranam vigna naashanam kaanipaakamuna nee darshanam
Jaya Jaya shubakara vinaayaka
sree Kaanipaaka vara siddi vinaayaka
Jaya Jaya shubakara vinaayaka
sree Kaanipaaka vara siddi vinaayaka
Pindi bommavai prathibha chupi bramhandanaayakudivainaavu
Maathapithalaku pradakshinamutho mahaa ganapathiga maaravu
baktula moralaalinchi brochutaku gajamuka ganapathivainaavu
brammandamu nee bojjalo daachi lambodarudavu ainaavu
laabamu shubamu keerthini kurpaga laxmiganapathivainaavu
vedha puraanamulakila shasramulu kalaloo chaatunu nee vaibhavam
vakratundame omkaaramanu vibhudulu chese nee keerthanam
Jaya Jaya shubakara vinaayaka
sree Kaanipaaka vara siddi vinaayaka
Jaya Jaya shubakara vinaayaka
sree Kaanipaaka vara siddi vinaayaka
aa..aa..aa..aa..aa...
Movie Name : Devullu (2001)
Music Director : Vandemathrama Srinivas
Lyricist : Jonnavittula Ramalingeshwara Rao
Singer : S.P.Bala Subramaniam