పల్లవి :
తనన... ఆ... తనన... ఆ... (2)
తనన... రేపల్లె మళ్లీ మురళి విన్నదీ
తనన... ఆ పల్లె కళే పలుకుతున్నదీ
తనన... ఆ జానపదం ఝల్లుమన్నదీ
తనన... ఆ జాణ జతై అల్లుకున్నదీ
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసేయ్యనా ప్రణయవేదిక
మల్లెనవ్వు మారాణి ఈ గొల్ల గోపికా
మూగమనసు వింటున్నది మురళి గీతికా
॥రేపల్లె॥
తానన తందానన తఝం తఝం ఝం
చరణం : 1
ఆ... పెంకితనాల పచ్చిగాలి ఇదేనా
పొద్దుపోని ఆ ఈలలే నా ఈ ఆలాపన
ఆ... కరుకు తనాల కన్నెమబ్బు ఇదేలా
ఇంతలోనే చిన్నారి చినుకై చెలిమే చిలికెనా
అల్లరులన్నీ పిల్లనగ్రోవికి స్వరములిచ్చేనా
కళ్లెరజేసే కిన్నెరసానికి సరళినచ్చేనా
మెత్తదనం... తందననా మెచ్చుకునే
గోపాలకృష్ణయ్య గారాలు చెల్లించనా
॥రేపల్లె॥
ససరిసరి సరి సరి పనిని పప నినినినినిని
చరణం : 2
నీ... గుండె వినేలా వెంట వెంట ఉండేలా
గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో
ఆ... ప్రేమ పదాలా గాలిపాట స్వరాలా
పోల్చుకోని కలిపేసుకున్నాను నా శ్వాసలో
ఎక్కడవున్నా ఇక్కడ తిన్న వెన్నే వేణువయ్యే
కొంగునులాగే కొంటెతనాలే కంటికి వెలుగయే
వన్నెలలో... తందననా వెన్నెలలే
వెచ్చని వెల్లువలయ్యే వరసిదీ
॥
చిత్రం : అల్లరి మొగుడు (1992)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి, బాల సుబ్రహ్మణ్యం , కె.ఎస్. చిత్ర
***************************************
Movine Name : Allari Mogudu (1992)
Music Director : M.M.Keeravani
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : S.P.Bala Subramaniam, K.S.Chitra