పల్లవి :
ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి (2)
గగనం ఉన్నాళ్లదాకా కాలం కడతేరుదాకా
ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి
చరణం : 1
జాతి నిదుర లేచిన సమయం
జనానికిది పండుగ ఉదయం
అదిగో మన తపస్సు ఫలితం
అదే అదే మన స్వాతంత్య్రం
తరతరాల చీకటి ఇల్ల్లే
కటకటాల కౌగిట గుళ్ల్లే
బానిసలకు వారసులం
బ్రతికి ఉన్న పీనుగులం
ఎక్కడుంది స్వాతంత్య్రం
మాకేదీ ఆ స్వాతంత్య్రం
ఓ... మహామహుల త్యాగఫలం
మరిచిపోకు స్వాతంత్య్రం
యుగయుగాల పోరాటంలో
ఉదయించిన అమృతభాండం
స్వాతంత్య్రమే నీ జన్మహక్కని తెలుసుకో
అది అందుకునే అర్హత నీలో పెంచుకో
//ఎగరాలి//
చరణం : 2
ఇదిగిదిగో నా దేశంలో వెలిగిన
శతకోటి ఉషస్సులు
అదిగదిగో ఆకాశంలో
మువ్వన్నెల ఇంద్రధనుస్సులు
జైలన్నది భూతల నరకం
ఇది సజీవ శవాల దహనం జరిగే
మహా శ్మశానం
ఎక్కడుంది స్వరాజ్యం
రాబందుల రావణ రాజ్యం
ఓ... ఇది జగన్నాటక సూత్రధారి
శ్రీకృష్ణుడు జన్మించిన చోటు
రామదాసు మొరలే విని శరణే
శ్రీరాముడు విడిపించిన చోటు
ఇదే జాతిపిత బాపూజీ స్వరాజ్యాన్ని
సాధించిన చోటు
ఈ దేశం సందేశం నెహ్రూజీ వినిపించిన చోటు
//స్వాతంత్య్రమే// //ఎగరాలి//
చిత్రం : మోసగాడు (1980)
రచన : వేటూరి
సంగీతం : చక్రవర్తి,
గానం : ఎస్.పి.బాలు