||సాకీ||
హుయ్ డుం కెయ్ డుం డుం డిగా డిగా సందడి సెయ్ తమాషగా
అంగ రంగ వైభవంగా సమరం వీధుల్లో సేరి సివమెత్తంగా
హుయ్.. దరువేయ్ తధినకా అడుగేయరా అదిలెక్కా
సామిరంగా సిందాడంగా సీనయ్య యేడుకొండలు దిగికిందికిరాగా
.
||ప||
అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
.
||చ||
కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది కలై పోదుగా
ఓహోహో..ఓహొహో.. || 2 ||
కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది కలై పోదుగా
ఒకటై చిన్నా పెద్దా అంతా చుట్టూ చేరండి…
కథకై ఆటాడించే చోద్యం చూడండి
చంద్రుళ్లో కుందేలు సందెల్లో అందాలు
మన ముంగిట్లో కథాకళి ఆడేనా
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
||అమ్మ బ్రహ్మ దేవుడో||
.
||చ||
మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి
ఒహొహొ..ఒహొహొ.. || 2 ||
మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి
అప్నా తనామనా కదం తొక్కే పదానా
కప్నా తనా మనా తేడా లేదోయ్ నా
తందానా తాళానా కిందైనా మీదైనా
తలవంచేనా తెల్లారులూ తిల్లానా
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
||అమ్మ బ్రహ్మ దేవుడో||
చిత్రం : గోవిందా గోవిందా (1993)
సంగీతం : రాజ్-కోటి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , కె.ఎస్.చిత్ర
******************************************
Movie Name : Govinda Govinda (1993)
Music Director : Raj-Koti
Lyricist : Sirivennela sitarama sastry
Singers : S.P.Bala Subramanyam , K.S.Chithra