పల్లవి :
ఓ నవీనా నవీనా నవీనా ఓ ఓ ఓ.......
ఈ జగాన నువ్వే నా హసీనా ఓ ఓ ఓ...
ఏమి పులకింత ఇది ఎంత గిలిగింత
ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో...
//ఓ నవీనా//
చరణం : 1
కోకనైనా కాకపోతి కొమ్మచాటు సోకులన్నీ
తడిమే వేడిలో
కౌగిలైనా కాకపోతి ఆకలైన అందమంతా
అడిగే వేళలో
నీలోని తడి అందాలు
శృంగార మకరందాలు
నీ తీపి బలవంతాలు దోచేసె నా స్వప్నాలు
వసంతమాడే వయస్సు నీదే...
అది తెలిసిన సరసుడు
కలిసిన పురుషుడు జతపడితే
//ఓ నవీనా//
చరణం : 2
ఒంపులోన సొంపులిచ్చి
చెంపలోన కెంపులిచ్చి ఒదిగే వేళలో
నిద్దరోని కొత్తపిచ్చి నిన్ను చూసి కన్నుగిచ్చి
కలిసే ఆశలో
అల్లారు వయ్యారాలే అల్లాడిపోయే వేళ
చల్లారు పొద్దుల్లోన ఊపెయ్యనా ఉయ్యాల
ఇదేమి గోలో వరించు వేళ...
మనసెరిగిన సొగసరి
మదనుడి మగసిరి కలబడితే
//ఓ నవీనా//
గాలి గిలిగింత చెలి గాలి పులకింత
తొలి ప్రేమదెంత ఘాటు తాకిడో
ఊ... ఆహాహా.. ఒహోహో...
చిత్రం : గోవిందా గోవిందా (1994)
రచన : వేటూరి
సంగీతం : రాజ్-కోటి
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర