||ప|| |అతడు|
పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
నువ్వూ రామ్మా.. ఓ వేదమా
విడాకుల పత్రిక అందుకొని వెంటనే వేంచేయుమా
దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా ||పందిరి||
.
||చ|| |అతడు|
ప్రతి మనువు స్వర్గంలో మునుముందే ముడిపడుతుందా
ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా
|ఆమె|
నీ రాతలో ఎంత సత్యం ఉందో చూదువు బ్రహ్మయ్యా
నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా
నువ్వూ రామ్మా.. ఓ అరుంధతి
ఇదే నీ దర్శన బలమైతే ఎటైనా దాగిపోవమ్మా
నిజంగా పెళ్ళికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా ||పందిరి||
.
||చ|| |అతడు|
చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది
పతివిడిచిన సతి గమనం ప్రతినిమిషం రగిలిస్తుంది
|ఆమె|
ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ
ఓ బంధువులారా దీవించండి దీర్ఘ సహనమస్తు
నువ్వూ రామ్మా.. మాంగల్యమా
వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళకి
విడాకుల వేడుకలో నేడు తెంపడం నేర్పడానికి ||పందిరి||
చిత్రం : ఆహ్వానం (1996)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాలు , చిత్ర
******************************************
Pandhiri vesina akashaniki evvama ahwanam
Peetanu vesina ee nelamaku evvama ahwanam
Nuvvu rama o vedhama
Vidakula patrika andukuni jantane veru cheyuma
Dampatulu vidadise mantram kotaga nerchuko vama
Pandhiri vesina akashaniki evvama ahwanam
Peetanu vesina ee nelamaku evvama ahwanam
Prati manuvu swargamlo munumunde mudibadu tuna
A mate nijamaite ee chattam vidagodutunda
Nee rataku inta satyam undo chutumu brahmaiya
Nee saksham yenta viluvaindo o agni chudaiya
Nuvvu rama o arundati
Ide nee darshana balam aite yettaina dagi povama
Nijam ga peliki balam unte chutigi yitu digiravama
Pandhiri vesina akashaniki evvama ahwanam
Peetanu vesina ee nelamaku evvama ahwanam
Chiti mantala sahagamanam okasare bali chestundi
Pati vidichina satigamanam prati nimisham ragilistundi
A jvalalalo tone jeevincheti dhairyam andhistu
O bandhuvulara dheevinchandi deergasahanamastu
Nuvvuu rama mangalyama
Vivahaku vedikalo ninu mudesina ninati velaki
Vidakala vedukalo nedu tempadam nerpadaniki
Pandhiri vesina akashaniki evvama ahwanam
Peetanu vesina ee nelamaku evvama ahwanam
Movie Name : Aahwanam (1996)
Music Director : S.V.Krishna Reddy
Lyricist : Sirivennela Sitarama sastry
Singers : S.P.Bala subramaniam, Chitra