||ప|| |ఆతడు|
అనురాగమే మంత్రంగా
అనుబంధమే సూత్రంగా
మమత కొలువులో జరుగు పెళ్ళికి
మంగలవాయిద్యం పలికింది ఆహ్వానం ||2||
అనురాగమే మంత్రంగా
చరణం:
మూడుముళ్ళతోనే పెళ్ళిపూర్తికాదు అని
మరో ముడిగా చేరుకున్న స్నేహబంధమిది
సప్తపదితో ఆగ రాదు జీవితం అని
అష్టపదిగా సాగమన్న ప్రేమపధము ఇది
నాతిచెరామి మంత్రంలో అర్దం తెలిసిన నేస్తముతో
అడుగుకలుపుతూ వెలుగు వెతుకుతూ
సాగె సమయమిది ఆగని పయనమిది
||అనురాగమే||
చరణం:
ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని
అత్తగుండెలోన కూడ అమ్మ ఉన్నదని
బొమ్మలాటలాడుతున్న బ్రహ్మరాతలని
మార్చిరాసి చూపుతున్న మానవత్వం ఇది
చరితలు చదవని తొలికధగా
మనసులు ముడిపడు మనుగడగా
తరతరాలకు నిలిచిపొమ్మని తల్లిగా దీవించే చల్లని తరుణమిది
||అనురాగమే||
చిత్రం : పెళ్లి (1997)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఏసుదాస్