ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో..
అనుకోని వరమై చేరే అమృతాల వరదై పారే
తన పేరే ప్రేమ ఆ.. తనదే ఈ మహిమ
తనదే తొలి జన్మ ఆ.. తరువాతే బ్రహ్మ
ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో..
చూపుల్లో పున్నమి రేఖలుగా రూపుల్లో పుత్తడి రేఖలుగా
మారింది జీవన రేఖ నా హృదయంలో తానే చేరాక
అధరాలే మన్మధ లేఖ రాయగా అడుగేమో లక్ష్మణ రేఖ దాటదా
బిడియాల బాటలో నడిపే వారెవరో
బడిలేని పాఠమే నేర్పే తానెవరో
విడిపోని ముడివేసి మురిసేదెవ్వరో ఎవరో.. ఎవరో..
మల్లెలతో స్నానాలే పోసి నవ్వులతో నగలెన్నో వేసి
చీకటితో కాటుక పెట్టి నన్నే తాను నీకై పంపింది
సొగసంతా సాగరమల్లే మారగా కవ్వింత కెరటాలల్లే పొంగగా
సరసాల నావలో చేరేవారెవరో
మధురాల లోతులో ముంచే తానెవరో
పులకింత ముత్యాలే పంచేదెవ్వరో ఎవరో…
ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో..
అనుకోని వరమై చేరే అమృతాల వరదై పారే
తన పేరే ప్రేమ ఆ.. తనదే ఈ మహిమ
తనదే తొలి జన్మ ఆ.. తరువాతే బ్రహ్మ
ఎవరో.. ఎవరో.. యదలో.. ఎవరో..
చిత్రం : భగీరథ (2005)
సంగీతం : చక్రి
రచన : చంద్రబోస్
గానం : హరిహరన్, కౌసల్య