హాయిగా ఉండదా ప్రేమనే భావనా
మనసుతో మనసుకీ వెయ్యదా వంతెనా
కదిలే అడుగుల వెంటా
మమతే వెలుగై రాదా
కనుపాపకీ రెప్పలా కాయదా
పెదవంచుపై నవ్వులా సంతకం చెయ్యదా
ఈ ప్రేమ లోతెంతనీ అడగొద్దు ఓ మిత్రమా
ఈ ప్రేమ ఘనచరితనీ వర్ణించడం సాధ్యమా !
హాయిగా ఉండదా ప్రేమనే భావనా
మనసుతో మనసుకీ వెయ్యదా వంతెనా
మనసంటూ లేకుంటే అది ఇచ్చేటందుకే
ప్రేమంటూ ఒకటుందీ అది పంచేటందుకే
ప్రేమించేందుకొక క్షణమె చాలూ మొదలౌతుంది తొలి సంబరం
ప్రేమను మరచిపోదాము అంటే సరిపోదేమో ఈ జీవితం
జత కలిసె కనులు కనులూ
ప్రతిదినము కలలు మొదలూ
ఒక చినుకు లాగ మొదలైన ప్రేమ .. అంతలో సంద్రమై పొంగదా !
ఆపాలన్నా అణచాలాన్నా వీలే కాదుగా !!
హాయిగా ఉండదా ప్రేమనే భావనా
మనసుతో మనసుకీ వెయ్యదా వంతెనా
ఎదనిండా ప్రేముంటే ఏముందీ కానిదీ
కలకాలం తోడుండే గుణమేగా ప్రేమదీ
చుట్టం లాగ వచ్చెళ్ళిపోయే మజిలీ కాదు ఈ ప్రేమదీ
గుండెల్లోకి ఓ సారి వస్తే గుమ్మం దాటి పోదే ఇదీ
ఇక ఒకరినొకరు తలచీ
బతికుండలేరు విడిచీ
అసలైన ప్రేమ ఋజువైన చోట .. ఇక అనుదినం అద్భుతం జరగదా !
నీకేం కాదు నేనున్నానని హామీ ఇవ్వదా !!
హాయిగా ఉండదా ప్రేమనే భావనా
మనసుతో మనసుకీ వెయ్యదా వంతెనా
నిజమైనా ప్రేమంటే ఏ స్వార్ధం లేనిదీ
కష్ఠాన్నే ఇష్ఠం గా భావిస్తానంటదీ
పంచే కొద్దీ పెరిగేది ప్రేమా అర్ధం కాని సూత్రం ఇదీ
కల్లోలాన్ని ఎదురీదుకుంటూ తీరం చేరు నావే ఇదీ
నీ దిగులు తనకి దిగులూ
నీ గెలుపు తనకి గెలుపూ
నీ సేవలోనే తలమునకలయ్యి .. తండ్రిగా అన్నగా మారదా
నీవెనకాలే సైన్యం తానై నడిపించేనుగా !
హాయిగా ఉండదా ప్రేమనే భావనా
మనసుతో మనసుకీ వెయ్యదా వంతెనా
చిత్రం : సత్యభామ (2007)
సంగీతం: చక్రి
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం: కౌసల్య