కాంతమ్మత్తా !
అరె మొన్న బాగున్నాడూ, నిన్న బాగున్నాడు,
ఇప్పుడేమయ్యింది ఇసక పిసుకుతున్నాడు
వీడు దమ్ముకొట్టడే..మందు ముట్టడే..
కన్నెపిల్ల కమాన్ అన్నా కన్ను కొట్టడే
జబ్బు చేసిందా ? వీడి డబ్బు పోయిందా ?
కరెంటు వైరు మీద పడి షాక్ కొట్టిందా ? '
కరెంటు షాకే కొట్టేస్తే..నిను కరెంటు చీమే కుట్టేస్తే
హేయ్ సడన్ గా ప్రేమే పుట్టేస్తే..నిను వదల్ను అంటూ వట్టేస్తే
తొలి ప్రేమ తాడు నిన్ను కట్టేస్తే..అరె బాబాయి నీ బ్రతుకు బస్టాండే !
పదహారు వయసులో మల్లెతీగలా అల్లుకుంటదీ ప్రేమ
అది ప్రేమ కాదు నీ చిట్టి గుండెనే కుట్టిపోయినా దోమా
భలే కమ్ముకున్నదీ ప్రేమా..అది బ్రైనుకొచ్చినా కోమా
అహ కమ్మగున్నదీ ప్రేమా..వీడి ఖర్మ కాలెనా రామా
హేయ్ ..కరెంటు షాకే కొట్టేస్తే..నిను కరెంటు చీమే కుట్టేస్తే
సడన్ గా ప్రేమే పుట్టేస్తే..నిను వదల్ను అంటూ వట్టేస్తే
కలలా నిండిపోయె..ఓ అలలా పొంగి పోయే
వెలుగే వెన్నలయ్యే..నా చెలిలా ఉండు సఖియా
చెబుతున్నా విను కన్నా..నీ ప్రేమ పరుగుకి బ్రేకెయ్యి
వద్దన్నా కాదన్నా..నీ ముందరుంది ఓ గొయ్యి
తళ తళా తారకల్లే దారి చూపే దీపమేరా ప్రేమా
తెల తెల వారుతుంటే వేడి పంచే వేడుకేరా ప్రేమా
చెలి ప్రేమే రమ్మని పిలిస్తే..అది తప్పని సరిగా అవస్తే
తన రూపం రోజూ కొలిస్తే..ఓ రన్నా నీకొక నమస్తే !
హేయ్ ..కరెంటు షాకే కొట్టేస్తే..నిను కరెంటు చీమే కుట్టేస్తే
సడన్ గా ప్రేమే పుట్టేస్తే..నిను వదల్ను అంటూ వట్టేస్తే
ఓ ఎగిరే పావురాయీ..నా ఎదలో వాలిపోయీ
నాలో భాగమయ్యీ..నువు నాతో ఉండిపోవా
ఏమైనా..ఏదైనా..ముదిరింది కుర్రడా పిచ్చీ
నీ ఫ్యూజే కొట్టెయ్ దా ఆఫ్ చెయ్యకుంటే లవ్ స్విచ్చీ
తొలి తొలి చూపుతోటి చేరువయ్యే చైత్రమేరా ప్రేమా
సరా సరి చేతిలోనా చెయ్యివేసే మైత్రి కాదా ప్రేమా
చెలి వెంటే రోజూ నడిస్తే..మీ బాబుకి మాటర్ తెలిస్తే
తన ప్రేమలో నిండా తడిస్తే..ఓరయ్యో నీకొక నమస్తే !
హేయ్ ..కరెంటు షాకే కొట్టేస్తే..నిను కరెంటు చీమే కుట్టేస్తే
సడన్ గా ప్రేమే పుట్టేస్తే..నిను వదల్ను అంటూ వట్టేస్తే
తొలి ప్రేమ తాడు నిన్ను కట్టేస్తే..అరె బాబాయి నీ బ్రతుకు బస్టాండే !!
చిత్రం : సోగ్గాడు (2005)
సంగీతం : చక్రి
రచన : భాస్కర భట్ల రవికుమార్
గానం : చక్రి, రవి వర్మ