ఓర కన్నుల్తో చూపేస్తే చెలి .. ఊరుకోదే నా మనసూ
దోర నవ్వుల్తో చంపేస్తే చెలి.. ఉండనీదే నా మనసూ
మరువనులే మరువనులే..నిను కలనైనా మరువనులే
తెలియదులే తెలియదులే..ఇది ప్రేమో ఏమో తెలియదులే
మోజైన పిల్లే వస్తే మోహాన ప్రేమే పుట్టిందే..ప్రెమే పుట్టిందే !
ఓర కన్నుల్తో చూపేస్తే చెలి..ఊరుకోదే నా మనసూ
తోటలోని పూవులు అన్నీ పోటీ పడి నీ కూడినవే
ఆకాశాన జాబిలి కూడా నీకే భయపడి దాగినదే
అందం చందం కొత్తగ ఏదో బంధం వేసి పోయినదే
నిన్నే నిన్నే తలచిన వేళ ఆగని తలపు రేగినదే
మగువా నీ నడకల్లో కలహంసే కదిలినదే
చెలియా నీ నవ్వుల్లో హరివిల్లే మెరిసినదే
మనసైన పిల్లే వస్తే మదిలోన ప్రేమే పుట్టిందే..ప్రేమే పుట్టిందే !
ఓర కన్నుల్తో చూపేస్తే చెలి..ఊరుకోదే నా మనసూ
ఎండాకాలం వెన్నెల జల్లై చెలియా నన్ను తడిపినదే
వానాకాలం చలిమంటల్లే వెచ్చగ నన్ను రేపినదే
మగువా మగువా నీ సహవాసం నన్నే కొత్తగ మార్చినదే
సఖియా సఖియా కొంటెగ మనసే వీడని బంధం వేసినదే
పలికే నీ మాటలన్నీ నే విన్న వేదాలా
ఎదలోని తలపులన్నీ ఆ నింగి దీపాలా
వరసైన పిల్లే వస్తే వరదల్లే ప్రేమే పుట్టిందే..ప్రేమే పుట్టిందే !
ఓర కన్నుల్తో చూపేస్తే చెలి .. ఊరుకోదే నా మనసూ
దోర నవ్వుల్తో చంపేస్తే చెలి.. ఉండనీదే నా మనసూ
మరువనులే మరువనులే..నిను కలనైనా మరువనులే
తెలియదులే తెలియదులే..ఇది ప్రేమో ఏమో తెలియదులే
మోజైన పిల్లే వస్తే మోహాన ప్రేమే పుట్టిందే..నా న నా న నా న నా !
చిత్రం : దేవా (2007)
సంగీతం : యువన్ శంకర్ రాజా
రచన : వెన్నెలకంటి
గానం : కార్తీక్
***********************************
Movie Name : Deva (2007)
Music Director : Yuvan Shankar Raja
Lyricist : Vennelakanti
Singer : Karthik