నీకోసం నేనున్నానంటూ..నీ వెంటే కడదాకా ఉంటూ
నడిపించే అనుబంధమై రానా !
నీ గుండె సవ్వళ్ళే వింటూ..నీ తోటి నీ కలనే కంటూ
నీ కంటి కనుపాప నే కానా !!
మదిలో..దాచుకోనా
పదిలం .. చేసుకోనా
వరమైన ఈ బంధమే..
నీకోసం నేనున్నానంటూ..నీ వెంటే కడదాకా ఉంటూ
నడిపించే అనుబంధమై రానా !
నీ గుండె సవ్వళ్ళే వింటూ..నీ తోటి నీ కలనే కంటూ
నీ కంటీ కనుపాప నే కానా !!
కలత చెందినా..కనులు తుడిచినా
చెలిమి నేనవ్వనా !
పెదవి పంచినా..తపన పెంచినా
చెలిని నేనవ్వనా !!
జోల పాడి లాలించి..నీ అమ్మ లా మారనా
వెచ్చనైన కౌగిలిలో..ఓ పాపలా ఒదగనా
చూపు నీవై..పదము నేనై..కలిసి అడుగేయనా !
నీకోసం నేనున్నానంటూ..నీ వెంటే కడదాకా ఉంటూ
నడిపించే అనుబంధమై రానా !
నీ గుండె సవ్వళ్ళే వింటూ..నీ తోటి నీ కలనే కంటూ
నీ కంటీ కనుపాప నే కానా !!
It takes a second to say I Love You
.. but a life time to show it !
ఏడు అడుగులూ..మూడు ముళ్ళుగా
మనము జత కలిసినా
రెండు మనసులే..ఒకటి చేసినా
ప్రేమనే సాక్షిగా
ఏడూ జన్మలే అయినా..నీ తోడుగా నడవనా
మూడూముళ్ళనే మించి..అనుబంధమై అల్లనా
మరణమైన..గెలవలేని..మనువు మనదేనులే !
నీకోసం నేనున్నానంటూ..నీ వెంటే కడదాకా ఉంటూ
నడిపించే అనుబంధమై రానా !
నీ గుండె సవ్వళ్ళే వింటూ..నీ తోటి నీ కలనే కంటూ
నీ కంటీ కనుపాప నే కానా !!
మదిలో..దాచుకోనా
పదిలం .. చేసుకోనా
వరమైన ఈ బంధమే
చిత్రం : గీత (2008)
రచన : వంశీ
సంగీతం: సునీల్ కాశ్యప్
గానం: సునీత