ఎంతగా మరిచాననుకొన్నా
ఏ మూలో తన ఊసులనే తలచే మనసే
గుండెలో తన గురుతులనన్నీ
ఈ క్షణమే చెరిపేస్తున్నా వినదే వయసే
ఎదుటేం చూస్తూ ఉన్నా నవ్వుతున్న తనలా తోచెనా
ఎదలోన ఆశై కరిగి కంటి లోన అలలై తాకెనా
ఎంతగా మరిచాననుకొన్నా
ఏ మూలో తన ఊసులనే తలచే మనసే
మౌనం వీడి పెదవికి మాటే నేర్పి
తొలి స్వరాలు మీటే మదే తనతో పాటే
దూరం దాటి దరికే చేరే లోగా
ఇలా నిరాశ గీతం విధే పలికించేనా
నా రేపటి స్వప్నాలన్నీ....ఆ... నిన్నలలో చూస్తున్నానా
తనలోనే.... కొలువయ్యానా
కనలేకే..... శిలనయ్యానా
అలలెగసే ఎదలయలో అతడేనా ఇక నేనే లేనా
ఎంతగా మరిచాననుకొన్నా
ఏ మూలో తన ఊసులనే తలచే మనసే
రూపం లేని శ్వాసై నాలో చేరి
ఇకీ ప్రపంచమంతా తనే అనిపించాడే
రోజూ నాతో చిలిపిగా స్నేహం చేసి
తనో ముగింపు లేని కధే అవుతున్నాడే
ఆ ప్రేమను కాదనుకోనా...ఈ వేదననే నాదనుకోనా
కాలాన్నే.... నిలదిస్తున్నా
కలలన్నీ.... వెలి వేస్తున్నా
నెడుతున్నా హృదయాన్నే చెరలోన ఎడబాటేదైనా
ఎంతగా మరిచాననుకొన్నా
ఏ మూలో తన ఊసులనే తలచే మనసే
చిత్రం : రోమియో (2009)
సంగీతం : అగస్త్య
రచన : వనమాలి
గానం : శ్రేయా ఘోషల్