పూలు గుస గుసలాడేనని జత గూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈ రోజె తెలిసిందీ .. హా ఆ (2)
జల జల వరదలు నది మది పిలుపని తెలిసిందా
తెల తెల నురగలు కడలిలొ చెలిమని తెలిసిందా
నిన్నలే వీడనీ .. ఎండలే నీడనీ
నక్షత్రాలే నవ్వుతాయని
పాలపుంతలే పాడుతాయని
పుడమే నాట్యం ఆడుతుందని
అడవికి ఆమని చేరుతుందని
మయూరాలు పురి విప్పుతాయని
చకోరాలు తలలెత్తుతాయని
పావురాలు పైకెగురుతాయని
చిలక పళ్ళనే కొరుకుతందని
చేప నీటిలో తుళ్ళుతుందని
మబ్బు చినుకులే చల్లుతుందని
తేనెటీగలో ముళ్ళు ఉందని
తీగ పందిరిని అల్లుకుందని
జగతే కొత్తగ జన్మనెత్తునని
ప్రకృతి మొత్తం పరవశించునని
నేడే తెలిసిందీ !
" అయ్యబాబోయ్ చంటీ .. ఇంత కవిత్వం ఎలా చెప్పావ్ !"
"నా చిట్టి !"
ప్రేమ నాలో పుడుతుందని
ప్రేమలోనే పడతానని
ప్రేమతో మతి చెడుతుందని
నేడే తెలిసిందీ రు రు రు రూ !
పూలు గుస గుసలాడేనని జత గూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈ రోజె తెలిసిందీ ..
ఎదిగిన వయసుకు వరసే కలదని తెలిసిందా
వలచిన మనసుకు వయసే వరదని తెలిసిందా
అలజడే .. ఉందనీ
అలసటే .. లేదనీ
అల్లరి నాలో పెరుగుతుందని
అద్దం ఎపుడూ వదల్లేనని
ఆకలి నన్నే అంటుకోదని
ఆశలకేమో అంతులేదని
వేషం భాషా మారుతుందని
వేగం నన్నే తరుముతుందని
వేళా పాళా గురుతు రాదని
వేరే పనిలో ధ్యాస లేదని
ఒకటే దీపం వెలుగుతుందని
ఒకటే దైవం వెలసి ఉందని
ఒకటే మంత్రం మ్రోగుతుందని
ఒకటే మైకం కలుగుతుందని
ఒకటీ ఒకటీ ఒక్కటేనని
మోక్షం అంటే ఇక్కడేనని
నేడే తెలిసిందీ !
" అసలేమైంది చంటీ నీకూ.. "
ప్రేమ తరగతి చేరానని
ప్రేమశాస్త్రం చదివానని
ప్రేమ పట్టా పొందానని
నేడే తెలిసిందీ రు రు రు రూ !
పూలు గుస గుసలాడేనని జత గూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈ రోజె తెలిసిందా ..
చిత్రం : సలీమ్ (2009)
సంగీతం : సందీప్ చౌతా
రచన : చంద్రబోస్
గానం: ప్రదీప్ సోమసుందరన్, సోనూ కక్కర్