చినుకై వరదై సెలయేటి తరగై
ఉరికే మదిని కడలల్లే కనిపి౦చి కలిపేసుకున్నావు
వరమై వలపై అనుకోని మరుపై
కలలే చిలికే కనుపాప కన్నీట తొలి వేకువైనావు
తీసే ప్రతి శ్వాస నీ తలపవుతున్నది
రేగే ప్రతి ఆశ నువు కావాలన్నది..
నా నీడ నను విడి నిను చేరుకున్నది
నా నీడ నను వీడి నిను చేరుకున్నదీ
తడి లేని నీరున్నదేమో సడిలేని ఎద ఉన్నదేమో
నువు లేక నేనున్న క్షణమున్నదా
నాలోనీ ఏ నాటి చెలిమో నిను చేరి మనిషైనదేమో
ఈవేళ నిన్నొదిలి రానన్నదా
ఏ రూపమూ లేని ఆకాశమే నీవు
నా నీలి వర్ణాలు నిను వీడిపోలేవూ
ఏ బ౦ధమూలేని ఆన౦దమే నీవూ
తోడొచ్చినాకిప్పుడూ తొలి బ౦ధువైనావు
ఆకాశమే నీతో అడుగేయమన్నది
మన వలపు కథ విన్నదేమో ఆ కలల కబుర౦దెనేమో
ప్రతి ఋతువు మధుమాసమవుతున్నది..
పసితనపు లోగిళ్ళ లోకి నీ మనసు నను లాగెనేమో
నా వేలు నిను వీడన౦టున్నదీ..
ఆరారు కాలాలు హరివిల్లు విరియనీ
ఆ ని౦గి తారల్లే మన ప్రేమ నిలవనీ
నీ మనసు కొలువైన తొలి చోటే నీదనీ
నా కలలు నిజమవ్వగా ఆ విధినైనా గెలవనీ
లోకాలు కనలేని తొలి జ౦ట మనదనీ
చిత్రం : విలేజ్ లో వినాయకుడు (2009)
స౦గీత౦ : మణికా౦త్ కాద్రి
రచన: వనమాలి
గానం : హరిహరన్ , శ్వేతా మోహన్