" తనంటే నాకు చాలా ఇష్ఠం
తనకూ నేనంటే ఇష్ఠం .. :) అనుకుంటా ! "
ఎటు చూసిన ఉన్నది నువ్వే కదా
చెలి ఆ నువ్వే నాకిక అన్నీ కదా
ఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా
నువ్వే లేనిదే ఏమీ తోచదే
నిన్నే తలవనీ రోజే ఉండదే
సెలయేరు చేసే గలగల సవ్వడి వింటే .. నీ పిలుపే అనుకుంటా
చిరుగాలి తాకీ గిలిగింతలు పెడుతుంటే .. నువ్వొచ్చావనుకుంటా
మైమరపేదో కమ్మిందో ఏమో !
నా మనసుకి కదలిక నీవల్లనే
నా కనులకి కలలూ నీవల్లనే
ఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా
వెలుగుల్ని పంచే మిణుగురు పురుగుల పైనా .. నీ పేరే రాశాలే
నువ్వొచ్చే దారుల్లో నవ్వుల పువ్వులు పోసీ .. నీ కోసం చూశానే
చెలియా ఎప్పుడు వస్తావో ఏమో !
నా చెరగని గురుతువి నువ్వే కదా
నా తరగని సంపద నువ్వే కదా
ఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా
చిత్రం : తాజ్ మహల్ (2010)
సంగీతం : అభిమాన్ రాయ్
రచన : భాస్కరభట్ల
గానం: కునాల్ గంజావాలా