పల్లవి :
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
(2)
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
చిగురులేసే సిగ్గు చీనాంబరాలు
తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు
॥
చరణం : 1
కనుబొమల నడుమ విరిగింది శివధనుసు
కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు
॥
ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని (2)
పొడిచింది ఓ చుక్క బుగ్గలో ఇప్పుడు
అందాలకెందుకు
గంధాల పూతలు (2)
కళ్లకే వెలుతురు
మా పెళ్లికూతురు
ఈ పెళ్లికూతురు...
॥
చరణం : 2
అడగలేదు అమ్మనైనా
ఏనాడు ఆకలని
అలుసు చేయవద్దు
మీరు తానేమి అడగదని
ఆడగబోదు సిరిసంపదలు
ఏనాడూ పెనిమిటిని
అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని
చెప్పలేని మూగబాధ
చెప్పకనే తెలుసుకో
మాటలకే అందని మనసు...
చూపులతో తెలుసుకో...
రెప్పవలే కాచుకో...
॥
చిత్రం : జస్టిస్ చౌదరి (1982)
రచన : వేటూరి, సంగీతం : చక్రవర్తి
గానం : బాలు, సుశీల, శైలజ