జినక్కి తయ్యా జినక్కి తయ్యా జినక్కి తయ్యరే
జినక్కి తయ్యా జినక్కి తయ్యా జినక్కి తయ్యరే
తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
ఏ చిన్ని సందళ్ళు విన్నా ఈ గుండె చాటున
నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా
దరి చేరే స్వరము నాకు వరము
ప్రతి రోజూ పదము పాడే సమయాన
నన్నే నీలో కన్నా
తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
కొమ్మ చాటుగా పల్లవించు ఆ గండు కోయిలమ్మ
గొంతులోని నా తేనెపట్టునే తాను కోరేనమ్మా
పరుగాపని వాగులలోనా కదిలే అలలే
నా పలుకుల గమకం ముందు తల వంచెనులే
ఎగిసే ....తేనె రాగాలు నీలిమేఘాలు తాకితే చాలు నింగి లోగిళ్ళు
జల్లై విల్లై తుళ్ళు
తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
ప ప స స ద స స ద ప ప ప ప గ స ని ప గ రి
స స ద ద ప ద ద ప గ ప స గ ప రి
ప ద ని స గ రి గ రి గ రి గ రి
ప ద ని స రి గ రి గ రి గ రి గ
ప ద ని స గ గ ప ద ని స గ గ ప ద ని స గ
ఇన్ని నాళ్ళుగా కంటి పాపలా పెంచుకున్న స్వప్నం
నన్ను చేరగా సత్యమవ్వదా నమ్ముకున్న గానం
పెదవంచున సంగతులన్నీ శ్రుతులై లయలై
ఎదనూపిన ఊపిరులవని స్వర సంపదలై
బతుకే .....పాటలా మారు బాటలో సాగు ఆశలే తీరు రోజులే
చేరువయ్యే లైఫే హాయే
తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
ఏ చిన్ని సందళ్ళు విన్నా ఈ గుండె చాటున
నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా
దరి చేరే స్వరము నాకు వరము
ప్రతి రోజూ పదము పాడే సమయాన
నన్నే నీలో కన్నా
తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
చిత్రం : కలవరమాయే మదిలో (2009)
సంగీతం : శరత్ వాసుదేవన్
రచన : వనమాలి
గానం : చిత్ర