మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి
ఇంటిపేరు మార్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమయి జరుగుతున్న పెళ్ళీ
బహుమానంగా ఆశీస్సులనే అడుగుతున్న పెళ్ళీ
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళీ
ఇంటిపేరు మార్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
దేవుళ్ళు , దేవతలు
కొలువయిలేరు కోవెలలో
బంధువులై ,చుట్టాలై
విచ్చేసినారు వాకిలిలో
ఊరు వాడ వేడుక ప్రతి ఒక్కరి హృదయం వేదిక
లేనే లేదు తీరిక ప్రతి నిమిషం తెలియని తికమకా
మైనాలూ ,కోయిలలూ
కూర్చోలేదు కొమ్మలలో
మా వాళ్ళై అయినోళ్ళై ఒక చెయ్యేసినాయి మేళంలో
పందిరిలోన పండుగలన్ని నిలుపుతున్న పెళ్ళీ
నవ్వులలోన కన్నుల తడిని కలుపుతున్న పెళ్ళీ
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళీ
ఇంటిపేరు మార్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
మా నాన్నా ,మా అన్న
ఇద్దరు నాకు పుట్టిళ్ళు
అందరికి సెలవంటు
నేవెళ్ళి వొస్తా అత్తిళ్ళు
చల్లని చూపే కాటుక
ఇక తరగని ప్రేమే బొట్టుగ
మమకారాలే సిరులుగ మెట్టిన్ట్లో ఉంటా సీతగ
ఆత్రానై సూత్రనై ముద్దుగా వేస్తా బంధాలు
నేస్తానై , నీ వాడ్నై
నీ వద్ద వుంటా వందేళ్ళు
మాటలు కలిసే
మనసులు కలిసే
ముచ్చటయిన పెళ్ళీ
కలిసిన మనసె సాక్షిగా నిలిచే స్వచ్చమయిన పెళ్ళీ
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి
ఇంటిపేరు మార్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి
ఇంటిపేరు మార్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
చిత్రం : లక్ష్మీ నరసింహ (2003)
సంగీతం : మణిశర్మ
రచన : చంద్రబోస్
గానం : శంకర్ మహదేవన్ , శ్రివర్ధిని , మురళీధర్